తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన కమెడియన్ ..!

By Xappie Desk, January 07, 2019 12:56 IST

తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన కమెడియన్ ..!

ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు మరియు కార్యకర్తల హోరు పెరిగింది. ఈ క్రమంలో ప్రాంతాలవారీగా జనసేన పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వారి యొక్క సలహాలు తీసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగారు ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ ఫేమ్ “హైపర్ ఆది”. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.

2009 లో ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ముంచేసారని కానీ ఇప్పుడు వచ్చింది మొండి వ్యక్తని అలాంటి పవన్ ని ముంచడం ఉండదు తాడో పేడో తేల్చుకోడమే ఉంటుందని చెప్పారు. పవన్ లాంటి మంచి వ్యక్తికి ప్రతీ ఒక్కరు అండగా నిలబడాలని అందుకే తాను కూడా వచ్చానని తెలిపారు.పవన్ కి ఎలక్షన్ అయినా కలెక్షన్ అయినా ఒకటే అని ఆ రెండింటిలోనూ రికార్డులు బద్దలవుతాయని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో మంచి వ్యక్తికి ఓటు వేయండి అని సలహా ఇచ్చారు హైపర్ ఆది. దీంతో హైపర్ ఆది చేసిన కామెంట్లు అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయ రంగంలో సంచలనం సృష్టించాయి..Top