ఉత్కంఠ రేపుతున్న ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ…?

By Xappie Desk, January 07, 2019 13:04 IST

ఉత్కంఠ రేపుతున్న ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ…?

గత కొంత కాలం నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై సోషల్ మీడియాలో ను అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలోనూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ చుక్కలు చూపిస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో త్వరలో పార్లమెంట్ లో అడుగు పెట్టి కచ్చితంగా పోటీ చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ పడతానని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నారని ఇటీవల సంచలన ప్రకటన చేశారు.

అయితే ప్రకాష్ రాజ్ ప్రకటనతో ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారో నాన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల బెంగ‌ళూరు సెంట్ర‌ల్ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీకి దిగుతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా శ‌నివారం ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ని వెల్ల‌డిస్తాన‌ని, త‌న కొత్త ప్ర‌యాణానికి స‌హ‌క‌రిస్తున్న అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. అయితే గ‌త కొంత కాలంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని చెప్పిన ప్ర‌కాష్‌రాజ్ వున్న‌ట్టుండి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీకి దిగుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గరిచేస్తోంది. మొత్తంమీద జాతీయస్థాయిలో పార్లమెంట్లో ప్రకాష్ రాజ్ రూపాన మంచి ప్రత్యర్థి బిజెపి పార్టీ ఎదుర్కో బోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top