జగన్ కి మెల్ల మెల్లగా పెరుగుతున్న మీడియా మద్దతు..!

By Xappie Desk, January 07, 2019 13:06 IST

జగన్ కి మెల్ల మెల్లగా పెరుగుతున్న మీడియా మద్దతు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా విజయవంతంగా పాలన కొనసాగించడానికి గల కారణాలలో ప్రధాన కారణం మీడియా మద్దతు. టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పుడో కూడా చంద్రబాబు కి మద్దతుగా కథనాలు ప్రసారం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్న చంద్రబాబు పాలన కొనసాగుతోందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే చాలా మీడియా చానెళ్లు ప్రస్తుత పరిస్థితుల బట్టి జగన్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాయి మొదటగా సాక్షి ఛానల్ జగన్ ఇంటర్వ్యూ తీసుకుంది.

సాక్షి జగన్ సొంత ఛానల్ కాబట్టి అందులో పెద్ద ఆశ్చర్యం లేదు, ఆ తర్వాత టీడీపీ అను”కుల” ఛానల్ కూడా తీసుకుంది, ఆ ఇంటర్వ్యూ ఆద్యంతం జగన్ కు పాజిటివ్ గానే సాగింది. సాధారణంగా జగన్ కు మినిమమ్ కవరేజ్ కూడా ఇవ్వని ఆ ఛానల్ ఏకంగా గంట పాటు ఇంటర్వ్యూ చేయటం ఆశ్చర్యం అయితే, ఛాన్స్ దొరికితే జగన్ ను కార్నెర్ చేద్దాం అని చూసే ఆ ఛానల్ ఇంటర్వ్యూ పాజిటివ్ గా ఉండటం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, జగన్ కూడా ఆ ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు, తడబడకుండా తన మనసులో ఎప్పటినుండో ఉన్న మాటలన్నీ స్పష్టంగా చెప్పాడు. మొత్తంమీద ఎన్నికల ముందు టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్ లు జగన్ ఇంటర్వ్యూలు తీసుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల పెద్ద హాట్ టాపిక్ అయింది.Top