ఏపీలో పార్లమెంటు స్థానాలు ఏ పార్టీకి ఎంతో బయటపెట్టిన సంచలన సర్వే..!

By Xappie Desk, January 07, 2019 13:11 IST

ఏపీలో పార్లమెంటు స్థానాలు ఏ పార్టీకి ఎంతో బయటపెట్టిన సంచలన సర్వే..!

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పొత్తుల గురించి కొంతమంది పార్టీ అధినేతలు చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వేడి పుట్టించగా మరోపక్క జాతీయ సర్వేల ఫలితాలు ఏపీ ప్రజలను మరియు పార్టీ అధినేతలను టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ లో ఉన్న రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే అధికార పార్టీ తెలుగుదేశానికి మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో చేజారిపోయిన విజయాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం వచ్చిన అధికారాన్ని ఏ మాత్రం చేజారిపోకుండా కాపాడుకోవాలని గత ఎన్నికలలో తన పార్టీకి తనకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ని ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్ప‌టికే ఏపీలో కొన్ని జాతీయ సంస్థ‌ల‌తో పాటు, లోక‌ల్ సంస్థ‌లు కూడా స‌ర్వేలు నిర్వ‌హించాయి.

ఈ క్ర‌మంలో తాజాగా సీఎన్ఎక్స్ అనే రీసెర్చ్ సంస్థ చేసిన స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. దేశ వ్యాప్తంగా స‌ర్వే నిర్వ‌హించిన సీఎన్ఎక్స్ సంస్థ, ఏపీ రిజ‌ల్ట్స్ చూస్తే.. ఏపీలో ఉన్న మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల‌కు గానూ.. కేంద్ర పార్టీలైన బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాద‌ని, కాంగ్రెస్‌కు మాత్రం- 2 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఇక అధికార టీడీపీకి- 4 సీట్లు వ‌స్తాయ‌ని, ప్ర‌తిప‌క్ష వైసీపీకి – 19 సీట్లు వ‌స్తాయ‌ని సీఎన్ఎక్స్ స‌ర్వే సంస్థ తేల్చేసింది. ఇక ఏపీ అసెంబ్లీ స్థానాలు కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది. తాజాగా వచ్చిన ఈ ఫలితాలు చూసి వైసీపీ పార్టీ క్యాడర్ మరియు కార్యకర్తలు ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారు.Top