ఏపీ మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చిన జనసేన అధినేత పవన్..!

By Xappie Desk, January 07, 2019 13:13 IST

ఏపీ మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చిన జనసేన అధినేత పవన్..!

త్వరలో ఏపీ లో ఎన్నికలు వస్తున్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివిధ జిల్లాల ప్రాంతాల పార్టీకి సంబంధించిన నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో తాను ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు అన్ని విధాలా వారిని పైకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇందులోభాగంగా వారికి ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నట్లు ఆదివారం ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అలాగే వారి కోసం ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను, మహిళా బ్యాంకును సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తాము కొత్తగా చట్టాలు చేయబోమని, ప్రస్తుతం ఉన్న చట్టాలనే పగడ్బందీగా అమలు చేస్తామన్నారు. మహిళల రక్షణ జనసేన బాధ్యత అని పేర్కొన్న పవన్‌కల్యాన్‌ పార్టీ ఎమ్మెల్యేలు మహిళల గురించి తప్పుగా మాట్లాడుతున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కాలం కూడా తమకు అనుకూలంగా ఉందని, అందుకే సామాన్యుల గాజు గ్రాస్‌ జనసేన ఎన్నికల గుర్తుగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ పట్ల ఏపీ మహిళలు ఎంతగానో సంతోషించారు..సోషల్ మీడియాలో కూడా చాలా మంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.Top