తన కుమారుడు జగన్ చేస్తున్న పాదయాత్ర పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విజయమ్మ.!

తన కుమారుడు జగన్ చేస్తున్న పాదయాత్ర పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విజయమ్మ.!

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న క్రమంలో తాజాగా ఇటీవల వై ఎస్ జగన్ తల్లి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైయస్ జగన్ చేసిన పాదయాత్ర పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం ఒక కుటుంబం నుండి ముగ్గురు పాదయాత్రలు చేయడం దేశంలో ఇదేనేమో నని అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన చాలామంది బంధువులు నాయకులు దూరమైనా గాని ప్రజలు ఎప్పుడూ కూడా వైయస్ కుటుంబాన్ని వదులుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజశేఖరరెడ్డి చనిపోయిన నాటినుండి ప్రజలతోనే వైయస్ జగన్ ఎక్కువ సమయం గడిపారని అన్నారు.
 
ముఖ్యంగా పాదయాత్రలో ప్రజలతో జగన్ ఇంటరాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్న ప్రశ్నకు విజయమ్మ మాట్లాడుతూ మనుషులను చూసే కొద్దీ... వాళ్ల బాధలను చూసే కొద్దీ... వాళ్ల కష్టాలను చూసే కొద్దీ తనలో ప్రేమను జగన్‌ రోజు రోజుకూ పెంచుకోగలుగుతున్నాడు. జగన్‌ చిన్నవాడైనందున అందరినీ అవ్వా, తాతా, అక్కా, చెల్లీ అని పిలుస్తాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సొంత మనిషిలా ప్రేమను అందిస్తున్నాడు. ఒక భరోసా ఇస్తున్నాడు. ఆ భరోసా కోసం ఆ ఆప్యాయత చూపుతున్నాడు. అందుకనే తమవాడిలా భావిస్తున్నారు. అదే తరహాలో వాళ్లు కూడా అప్యాయత చూపుతున్నారు. ఒక జగన్ తల్లిగా నేను జగన్‌ను చూసినప్పుడు ఇంతమంది ప్రజలకు ఓదార్పు కాగలుగుతున్నాడు. ఇంతమందికి ధైర్యం చెప్పగలుగుతున్నాడు అని సంతోషం అనిపిస్తుంది.Top