సంచలన రికార్డులు నమోదు చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు..!

సంచలన రికార్డులు నమోదు చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో 24 గంటలు ఏకధాటిగా పనిచేసి కొత్త రికార్డు తన పర్యవేక్షణలో నమోదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో వైసిపి సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని.. ఇది కూడా గిన్నిస్ రికార్డులో చేర్చవచ్చని సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి రూ. లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
 
ఏపీ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోందని, వైఎస్‌ జగన్‌తోనే అది సాధ్యమని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే ప్రే‍త్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర దాగుంది కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని, ఎన్‌ఐఏకు సహరించవద్దని చంద్రబాబు పోలీసులకు డైరెక్షన్‌ ఇస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబు ఢిల్లీ వచ్చినంత మాత్రనా ఏపీకి ఒరిగేదేమీ లేదని, దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఆయనను నమ్మదని అన్నారు.Top