దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న ఎస్పీ బీఎస్పీ కూటమి..!

By Xappie Desk, January 08, 2019 12:33 IST

దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న ఎస్పీ బీఎస్పీ కూటమి..!

త్వరలో దేశంలో పార్లమెంటు ఎన్నికలు రానున్న క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఎలాగైనా గద్దె దించాలని దేశంలో ఉన్న చాలా పార్టీలు ప్రముఖ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బిజెపి పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ తనకు కొత్త స్నేహితులను కలుపుకునే కళను నేర్పిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బిఎఎస్పి అదినేత్రి మాయావతి నివాసంలో ఆయన భేటీ అయి సీట్ల సర్దుబాటు పై ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక పత్రికతో ఆయన మాట్లాడారు.
 
తాను ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ లో ఐదేళ్లు అనేక అబివృద్ది కార్యక్రమాలు చేపట్టానని, కాని నెంబర్ గేమ్ లో ఓటమి చెందవలసి వచ్చిందని ఆయన అన్నారు. యుపిలో పలు చిన్న పార్టీలను కలుపుకుని బిజెపి ఎన్డిఎ ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు. దేశానికి, ఉత్తరప్రదేశ్ కు ఎస్పి, బిఎస్పి కలయిక ద్వారా కొత్త సంకీర్ణాన్ని ఇవ్వగలుగుతామని, కొత్త ప్రధాని రావడానికి తమ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. తాము చేసిన అబివృద్ది ప్రాజెక్టులకు బిజెపి ప్రారంబోత్సవాలు చేస్తోంది తప్ప కొత్తవి ఏమీ చేయడం లేదని ఆయన అన్నారు.Top