గుంటూరు వైసీపీలో అంతర్గత విభేదాలు..!

గుంటూరు వైసీపీలో అంతర్గత విభేదాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది పార్టీలో వర్గ విభేదాలు మరియు టికెట్ల గోల లు మొదలైపోయాయి. తాజాగా ఇటీవల వైసీపీ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీలో నాయకుల మధ్య తీవ్ర విభేదాలు బయటకు వచ్చాయి. సత్తెనపల్లి వైసీపీ పార్టీ కన్వీనర్ అంబాటి రాంబాబు కు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు అదే పార్టీకి చెందిన వారు గోశాలలో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు.
 
ఈ సమావేశానికి పలువురు జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో సత్తెనపల్లి వైసీపీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంబటి పార్టీపరంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అందరికీ సమ ప్రాధాన్యం కల్పించడం లేదని అసమ్మతి వర్గం ప్రధానంగా ఆరోపిస్తోంది. అంబటి రాంబాబు ఇదే విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో సహకరించకూడదని ఆయన అసమ్మతి వర్గం భావిస్తోంది. అయితే ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది వైసీపీ పార్టీ కార్యకర్తలు పార్టీకి మంచి మైలేజీ వస్తున్న క్రమంలో ఇలాంటి గొడవలు చూసుకోకుండా అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని లేకపోతే 2014 పరిస్థితి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.Top