అమరావతికి వచ్చేస్తున్న జగన్..!

By Xappie Desk, January 08, 2019 12:44 IST

అమరావతికి వచ్చేస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకున్న క్రమంలో ఈనెల 9న ఇచ్చాపురంలో జ‌రిగే భారీ బ‌హిరంగ ముగింపు సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన వారు. ఈ క్రమంలో ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలను హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుండి పర్యవేక్షించిన జగన్ రానున్న రోజుల్లో ఎన్నికలు దగ్గర వస్తున్న క్రమంలో ఏపీ నూతన రాజధాని అమరావతికి తన పూర్తి మకాంని మార్చి పోతున్నట్లు పార్టీ నుండి వస్తున్న సమాచారం.
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే అమ‌రావ‌తిలో నిర్మిస్తున్న పార్టీ కార్యాల‌యం , ఇళ్లు పూర్తి కావ‌స్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో జ‌గ‌న్ త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను హైద‌రాబాద్‌నుంచి అమ‌రావ‌తికి మార్చ‌నున్నారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే నాలుగు నెలలు ఎన్నిక‌ల సీజ‌న్ కాబ‌ట్టి అక్క‌డి నుంచే రాజ‌కీయాలు చేయనున్నారు. ఇది వైసీపీ శ్రేణుల‌కు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింప‌నుంది. మరోపక్క రేపు ముగింపు సభ జరగనున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్న చాలామంది వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ ముగింపు సభకు వెళ్లడానికి అన్ని విధాల రెడీ అవుతున్నారు. మొత్తం మీద ఎన్నికలు చివరాకరికి వచ్చేసరికి జగన్ తన పాదయాత్ర ద్వారా జగన్ మేనియా సృష్టించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.Top