జగన్ పై మళ్ళీ సేమ్ క్యాండిడేట్ ని రిపీట్ చేస్తున్న చంద్రబాబు..!

By Xappie Desk, January 08, 2019 12:56 IST

జగన్ పై మళ్ళీ సేమ్ క్యాండిడేట్ ని రిపీట్ చేస్తున్న చంద్రబాబు..!

వైయస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గం రాజకీయంగా కంచుకోట అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైఎస్ కుటుంబాన్ని ఓడించిన రాజకీయ నాయకులు ఎవరూ లేరు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో పులివెందుల ప్రజలు ఎప్పుడూ కూడా వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నారు. అయితే గత కొంత కాలం నుండి వైయస్ కుటుంబాన్ని ఇక్కడ ఎదుర్కొంటున్న నాయకులలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి 1999 నుండి వైయస్ కుటుంబం పై పోటీ చేసి అలుపెరగని పోరాటం చేస్తూ ఓటమి పాలవుతున్నారు.
 
అయితే తాజాగా మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పులివెందుల లో ఎలాగైనా తెలుగుదేశం జెండా ఎగురవేయాలి అని వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రెండుసార్లు, జగన్ పై రెండుసార్లు పోటీ చేసిన ఈయన్ను ఇప్పటి వరకు గెలుపు వరించలేదు. అయినా 2019 ఎన్నికలకు కూడ జగన్ ఫై పోటీగా ఈయన్నే చంద్రబాబు ఖరారు చేశారు. కొన్నిరోజుల క్రితం కడప జిల్లా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ఈసారి కూడ సతీష్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని సంకల్పించారు. సతీష్ రెడ్డి సైతం బాబు నిర్ణయానికి హర్షించి జగన్ పై పోటీకి ఉత్సాహంగా ఉన్నారట. అలాగే చంద్రబాబు మరియు టిడిపి పెద్దలు కూడా సారీ సతీష్ కుమార్ రెడ్డి ని గెలిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుగుదేశం పార్టీ నుండి వస్తున్న సమాచారం.Top