కేటీఆర్ కి మరో కొత్త బాధ్యత ..?

By Xappie Desk, January 09, 2019 14:39 IST

కేటీఆర్ కి మరో కొత్త బాధ్యత ..?

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో సంచలన విజయం సాధించిన కెసిఆర్ అతి కొద్ది సమయంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అటు దేశంలో ఇటు రాష్ట్రంలోనూ ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే పార్టీ పగ్గాలను తన కుమారుడు కేటీఆర్ కి అప్పగించి జాతీయస్థాయిలో ఫెడరల్ కూటమి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కెసిఆర్ తాజాగా కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈ నెల 18న మంచి రోజు నేపథ్యంలో ఆరోజు కేబినెట్ విస్తరణ ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నకేటిఆర్ కి 2014లో ఉన్న ఐటీ - పరిశ్రమలు - చేనేత శాఖతో పాటుగా ఈ దఫా సినిమాటోగ్రఫి శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా గతంలో సాగునీటి శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించగా.. ఈసారి మాత్రం దాన్ని కేసీఆర్ తన వద్దే పెట్టుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో హరీశ్ రావుకు ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది. ఇక గతంలో ఆర్థికశాఖ నిర్వహించిన ఈటెల రాజేందర్ కు ఈసారి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కు మాత్రం యధావిధిగా ఐటీ శాఖను కేటాయిస్తారని భావిస్తున్నారు. మరియు అదే విధంగా గత ప్రభుత్వంలో ఒక మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు లేని నేపథ్యంలో ఈసారి క్యాబినెట్ లో కచ్చితంగా అటువంటి అపవాదు తన మీద లేకుండా కెసిఆర్ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.Top