వైయస్ జీవిత కథ ‘యాత్ర’ ఫంక్షన్ లో వైయస్ జగన్..?

 వైయస్ జీవిత కథ ‘యాత్ర’ ఫంక్షన్ లో వైయస్ జగన్..?

దివంగత వైఎస్సార్ జీవిత కథను యాత్ర అనే టైటిల్ పేరిట తెరకెక్కించాడు డైరెక్టర్ మహి.వి రాఘవ్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి నిచ్చిన అధికారంలోకి తెచ్చిన వైఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన చిట్టచివరి ముఖ్యమంత్రిగా ప్రజల కోసం పేద వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మహానుభావుడు గా చరిత్రలో నిలిచిపోయారు. ఇటువంటి మహానుభావుడి బయోపిక్ 'యాత్ర' అనే టైటిల్ పేరిట రావడంతో చాలామంది వైఎస్ అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో వైఎస్ పాత్ర లో మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి అదరగొట్టారు.
 
తాజాగా విడుదలైన ట్రైలర్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రానున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్ర‌వరి 1 వైజాగ్‌లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి విజ‌య‌మ్మ కూడా ఈ ఫంక్ష‌న్‌కు రానున్న‌ట్లు స‌మాచారం. వైఎఆర్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు సంబంధించిన క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో వైఎస్ విజ‌య‌మ్మగా బాహుబ‌లి యాక్ట‌ర్ ఆశ్రిత వేముగంటి న‌టించింది. వైఎస్ రాజారెడ్డిగా జ‌గ‌ప‌తి బాబు న‌టించారు. జ‌గ‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావ‌డంతో ‘యాత్ర’ సినిమాకు బ‌జ్ పెర‌గ‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేష‌కులు



Top