నేనే కింగ్ మేకర్ అవుతా అంటున్న పవన్ కళ్యాణ్..?

By Xappie Desk, January 09, 2019 18:20 IST

నేనే కింగ్ మేకర్ అవుతా అంటున్న పవన్ కళ్యాణ్..?

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇటీవల కొన్ని మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఫలితాలు ఏ విధంగా ప్రజల నుండి రాబడుతుంది వంటి విషయాల్లో జగన్ క్లారిటీ ఇచ్చారు. అయితే జగన్ చేసిన కామెంట్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ముఖ్యంగా జగన్ 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు చీలినా గాని వైసిపి పార్టీ ఓటు బ్యాంకు కు ఎటువంటి నష్టం జరగదని జగన్ సంచలన కామెంట్లు చేశారు.
 
రాబోయే ఎన్నికల్లో ఏది జరిగినా గాని చివరాకరికి విజయం తమదేనని జగన్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ అనుకునే విధంగా అయితే జరిగే పరిస్థితులు ఇప్పుడు లేవని తెలుపుతున్నారు. 2014 లో ఉన్న పరిస్థితులే ఇంకా ఉన్నాయన్న భ్రమలో జగన్ మరియు చంద్రబాబు ఉండిపోయినట్టున్నారు, కానీ వాస్తవ పరిస్థితులు చూసుకున్నట్టయితే వారు అనుకునే విధమైన పరిస్థితులు అయితే ఇప్పుడు లేవని, వారి పార్టీకి యువతలో మంచి ఆదరణ ఉందని వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో యువత ఓటు బ్యాంకు కీలకమని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ అవుతాడని అన్నట్టుగా కామెంట్లు చేశారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top