ఎన్నికల ముందు చంద్రబాబు కి షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ..!

By Xappie Desk, January 09, 2019 18:28 IST

ఎన్నికల ముందు చంద్రబాబు కి షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ..!

ఎన్నికలు దగ్గర పడుతున్న కాలేజీ టీడీపీ అధినేత చంద్రబాబు కి సొంత పార్టీ నేతలే షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత తో తీవ్ర ఇబ్బందులు.. నిరసనలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకి సొంత పార్టీ నేతలు కూడా అదే రీతిలో వ్యవహరించడం దురదృష్టకరం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం చాలా కష్టమని అర్థమైపోతుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక సర్వేలలో కూడా చంద్రబాబు కి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో ఈసారి కచ్చితంగా టి డి పి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే అని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు. మరోపక్క వైసీపీ అధినేత జగన్ మాత్రం తన వ్యూహాలను ఎప్పటికప్పుడు పొద్దున చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.
 
మరి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో కూడా వైసిపి కచ్చితంగా గెలుస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న చాలా మంది ముఖ్య నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక తాజాగా వైసీపీ అండ్ జ‌గ‌న్ పై ఒంటి కాలుమీద లేస్తూ విమ‌ర్శ‌లు చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న సొంత సోద‌రుడు రాజ‌కీయ‌వ‌ర్గాలే ఆశ్చ‌ర్య‌పోయేలా టీడీపీ బ్యాచ్‌కి షాక్ ఇస్తూ.. వైసీపీలో చేర‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జగన్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్లిన బుద్దా నాగేశ్వ‌రరావు.. జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌త‌తో బీసీలకు న్యాయం జరుగుతుందని, అందుకే వైసీపీలో చేరాన‌ని ఆయన పేర్కొన్నారు.Top