టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లడానికి రెడీ అవుతున్న నందమూరి సుహాసిని..?

By Xappie Desk, January 09, 2019 18:34 IST

టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లడానికి రెడీ అవుతున్న నందమూరి సుహాసిని..?

దివంగత నందమూరి హరికృష్ణ తనయురాలు ఇటీవల తెలంగాణ రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన నందమూరి సుహాసిని అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోవడంతో ఇప్పటివరకు మీడియా ముందు గాని ఎక్కడా కూడా కనిపించలేదు. ఎన్నికల్లో ఓడిపోయాక సుహాసిని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన కథనం ప్రకారం త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం.
 
తనకు తెలియని రాజకీయరంగంలో సడన్ గా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్న చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చే దిశగా నందమూరి సుహాసిని ఆలోచిస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అన్న విషయంపై ఎక్కడా కూడా అధికారికంగా నందమూరి సుహాసిని ఎక్కడ కూడా మాట్లాడకపోవడం గమనించదగ్గ విషయం. ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ పార్టీలోకి ఏపీ ఎన్నికల ముందు నందమూరి సుహాసిని వెళ్తే కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం చేసినట్లు అవుతుందని... నందమూరి కుటుంబం వైయస్ కుటుంబంతో కలిసి పోయిందన్న అనే కామెంట్లు కూడా వినబడతాయి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top