జగన్ కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు..!

By Xappie Desk, January 09, 2019 18:41 IST

జగన్ కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు..!

రాజకీయాలలో వైఎస్ కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత దగ్గరగా అభిమానించే కుటుంబాలలో ఒక కుటుంబం సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కుటుంబం. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో వైసీపీ పార్టీ కార్యక్రమాలలో చాలా చురుకుగా వ్యవహరించే వారు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. ఈ క్రమంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆదిశేషగిరిరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తన రాజీనామాకు కారణం రాబోయే ఎన్నికల్లో టికెట్ విషయంలో జగన్ నుండి సరైన స్పష్టమైన హామీ రాకపోవడమే అని టాక్. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు.
 
దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏ పార్టీలో చేరుతార‌న్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. టీడీపీలో చేరుతార‌నే వార్త‌లు వ‌స్తున్నా… జ‌న‌సేన‌లో కూడా చేరే అవ‌కాశాలు లేక‌పోలేదు. టీడీపీలో చేరినా గుంటూరు నుంచి టికెట్ ద‌క్కే అవ‌కాశాలు మాత్రం లేవ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం అక్క‌డ సిట్టింగ్ ఎంపీగా ఆదిశేషగిరిరావుకు అల్లుడు వరుసైన గల్లా జయదేవ్ టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఆయనే మళ్లీ బరిలో దిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆదిశేషగిరిరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.Top