మళ్లీ ఢిల్లీలో భేటీ అయిన చంద్రబాబు రాహుల్ ఈసారి స్కెచ్ పెద్దది..!

By Xappie Desk, January 09, 2019 19:06 IST

మళ్లీ ఢిల్లీలో భేటీ అయిన చంద్రబాబు రాహుల్ ఈసారి స్కెచ్ పెద్దది..!

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో దాదాపు అరగంట పాటు సమావేశమైనట్లు సమాచారం. రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు రాబోయే ఏపీ ఎన్నికల గురించి మరియు దేశం లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో తలెత్తే సమస్యలపై ఇతర నేతలతో సంప్రదింపులు వంటి అంశాలపై వీరు చర్చించనున్నట్టు సమాచారం.
 
శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, సీతారాం ఏచూరీలతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 19న కోల్ కతాలో బహిరంగ సభ అనంతరం, దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న భారీ ర్యాలీలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ నేతలతో భేటీ అనంతరం, తమ పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 9న ఢిల్లీలో విపక్షాల భేటీకి కొనసాగింపుగా రాహుల్ ని చంద్రబాబు కలవడం గమనార్హం. మొత్తం మీద చంద్రబాబు రాహుల్ ఢిల్లీ వేదికగా రాష్ట్ర రాజకీయాలు మరియు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నట్లు అటు కేంద్రంలో ఉన్న మోడీని ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రత్యర్థులకు చుక్కలు చూపించడానికి చాణిక్య వ్యూహాలు పన్నుతున్నట్లు స్కెచ్ లు వేస్తున్నట్లు అర్థమవుతుంది.Top