ముగిసిన జగన్ పాదయాత్ర..!

By Xappie Desk, January 10, 2019 13:33 IST

ముగిసిన జగన్ పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశంలోనే చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయనాయకుడు చేయని విధంగా దాదాపు సంవత్సరం కు పైగా సామాన్యులతో మమేకమయ్యారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసిన పాదయాత్ర సందర్భంగా అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పాలన ఉంటుందో అర్థమయ్యేరీతిలో జగన్ ప్రసంగించారు.
 
దాదాపు 13 జిల్లాల గుండా 341 రోజులు 3648 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. 2017 నవంబర్ 6 వ తారీఖున ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో 88 అడుగుల ఎత్తులో ‘విజయస్థూపం’ పేరుతో నిర్మించిన పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. ఈ భారీ బహిరంగ సభకు వైసిపి పార్టీకి చెందిన నాయకులు మరియు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కచ్చితంగా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు వైసీపీ పార్టీకి చెందినవారు.Top