పాదయాత్ర చివరి భారీ బహిరంగ సభలో రైతులకు వరాల జల్లు కురిపించిన జగన్..!

By Xappie Desk, January 10, 2019 13:38 IST

పాదయాత్ర చివరి భారీ బహిరంగ సభలో రైతులకు వరాల జల్లు కురిపించిన జగన్..!

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు పార్టీకి సంబంధించిన నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ రాష్ట్రంలో ప్రతి సమస్యపై అవగాహన ఉందని ఆరు నెలలు వారితో ఉంటే వారు వీరవుతారు వీరు వారవుతారు ఈ ఆరు నెలలు ప్రతి పేదవాడి తో అడుగులో అడుగు వేశారని చెప్పుకొస్తూ ప్రత్యర్థి పార్టీ నాయకులపై మరియు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో ప్రసంగించారు జగన్. ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడుతూ.. రైతులని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని, రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ పగటిపూట ఇస్తామన్నారు.
 
ఇకపోతే తెలంగాణలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న మాదిరి రైతుబంధు పథకంలాంటి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని జగన్ తెలిపారు. రైతు పెట్టుబడి పేరుతో పథకం తీసుకొస్తామని… మే నెలలో ప్రతీ రైతుకు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతులకు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తామని, రైతులకు బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్లుందని తెలిపిన జగన్, ప్రతీ మండలంలో కోల్డ్‌స్టోరేజ్ తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత… రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేస్తామన్నారు.Top