కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి..!

By Xappie Desk, January 10, 2019 13:43 IST

కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి..!

గతంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కింగ్ మేకర్ అవుతాడని అనుకున్న కుమారస్వామి చివరాకరికి కింగ్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బిజెపి పార్టీకి ఎలాగైనా అధికారం దక్కకూడదని చాలామంది కలిసి జేడీఎస్ అధినేత కుమారస్వామిని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఇప్పటివరకు నాకు సరైన గౌరవం లేదని ఒక పని వాడి లా పని చేస్తున్నానని తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేసినట్టు జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు తెలిపారు. సీఎం ఏడ్చినంత పనిచేశారని, ఆయనతో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని తమతో చెప్పినట్టు తెలిపారు.
 
రోజులను ఆయన కష్టంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వస్తోందని సీఎం తమతో చెప్పారని వివరించారు. కేబినెట్‌ను విస్తరించాలంటూ కాంగ్రెస్ నేతలు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతూ సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, ఈ విషయంలో వేచి చూసే ధోరణితో వ్యవహరిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద జేడీఎస్ అధినేత కుమార్ స్వామి పార్లమెంటు ఎన్నికల ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తో అటు జాతీయ రాజకీయాల్లో ను సంచలనాలు సృష్టించినట్లయింది.Top