ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాలకృష్ణ పై సంచలన కామెంట్స్ చేసిన లోకేష్..!

By Xappie Desk, January 10, 2019 13:48 IST

ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాలకృష్ణ పై సంచలన కామెంట్స్ చేసిన లోకేష్..!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తన తనయుడు నందమూరి బాలకృష్ణ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా రామారావు గారి జీవితానికి సంబంధించిన సినీ రంగాన్ని ఒక భాగం రాజకీయ రంగాన్ని మరొక భాగంగా రెండు పార్టులుగా తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. తాజాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. సినిమాను చూసిన చాలా మంది మరోసారి రామారావు గారిని చూసినట్లు ఉంది అంటూ బాలకృష్ణ పై సంచలన కామెంట్లు చేశారు.
 
ఈ క్రమంలో తన మామయ్య తీసిన ఈ సినిమా అపూర్వ విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తన ట్విట్టర్ ఎకౌంట్లో తెలిపారు నారా లోకేష్. సినిమాలో రామారావు గారి పాత్ర చాలా అద్భుతం అంటూ సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపారు. తాతగారు సామన్య కుటుంబంలో జన్మించి వెండితెర ఇలవేల్పుగా ఎదిగారని లోకేష్‌ కొనియాడారు. టిడిపిని స్థాపించి చరిత్ర సృష్టించారని, తాతయ్య బయోపిక్ తీసిన మామయ్య బాలకృష్ణకు లోకేష్ ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.Top