తనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్ కి కొత్త పేరు పెట్టిన చంద్రబాబు..!

By Xappie Desk, January 10, 2019 13:53 IST

తనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్ కి కొత్త పేరు పెట్టిన చంద్రబాబు..!

ఇటీవల పాదయాత్రలో భాగంగా అవినీతి చక్రవర్తి అంటూ చంద్రబాబు పై ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రం లోనూ మరియు దేశంలో ఎవరూ చేయని విధంగా చంద్రబాబు అవినీతి చేశారంటూ పుస్తకావిష్కరణ సమయంలో సంచలన కామెంట్ చేశారు వైసీపీ పార్టీకి చెందినవారు. ఈ నేపథ్యంలో తనపై కామెంట్లు చేసిన వారికి చాలా ఘాటైన కౌంటర్ వేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల వస్తున్న క్రమంలో ప్రజలతోనూ ఇటు నాయకులతోనూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్న చంద్రబాబు ఇటీవల పార్టీ నాయకులతో అమరావతిలో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు టిడిపి నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లడుతూ… వైఎస్‌ జగన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ అవినీతి చక్రవర్తి అన్ని ఆయన వల్ల ఎంతమంది జైలుకు వెళ్లారో ప్రజలకు వివరించాలన్నారు. అవినీతి పరులే అవినీతి అంటూ పుస్తకాల వేస్తున్నారని ఆయన విమర్శించారు. బాబు బాట -బంగారు బాట, జగన్‌ బాట- జైలు బాట అని ప్రజలక వివరించాలన్నారు. ఏపికి రావల్సిన నిధులపై జగన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. కేంద్రాన్ని నిలదీయలేని జగన్ రాబోయే రోజుల్లో ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడని సంచలన కామెంట్లు చేశారు చంద్రబాబు.Top