చివరి భారీ బహిరంగ సభలో బాబు ని ఓ ఆటాడుకున్న జగన్..!

By Xappie Desk, January 10, 2019 13:55 IST

చివరి భారీ బహిరంగ సభలో బాబు ని ఓ ఆటాడుకున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఇచ్చాపురంలో ముగిసిన నేపథ్యంలో పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న జగన్ తన చివరి ప్రసంగాన్ని అత్యద్భుతంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ప్రసంగించారు. ముఖ్యంగా ఈ పాదయాత్రలో ప్రతి పేదవాడి మనసు ని అవసరాలను గుర్తించానని రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యపై అవగాహన ఉందని కచ్చితంగా ప్రజలు దేవుడు ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైన సంక్షేమ ప్రభుత్వాన్ని అభివృద్ధి ఫలాలను నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తానని సామాన్యులకు అర్థమయ్యేరీతిలో తెలియజేశారు జగన్.
 
ఇదే క్రమంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికార హీనుడని, అధికారం వచ్చాకా అన్ని మర్చిపోయి చాల విలాసవంతంగా గడుపుతున్నాడని, ఉసరవెల్లిలాగా రంగులు మార్చే తత్త్వం చంద్రబాబు సొంతం అని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా ఎన్నికలకు మూడు నెలల ముందు ఒకలాగా ఎన్నికలు అయిపోయాక ఆరు నెలలు తరువాత ఒకలాగా ఉంటారని ప్రజలను మోసం చేయటం లో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ని మించిన వారు మరొకరు లేరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. ప్రస్తుతం జాతీయ రాజకీయాలను రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికొదిలేసి కొత్త డ్రామాలు ఆడుతున్నారని రాబోయే రోజుల్లో చంద్రబాబుని నమ్మకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్.Top