పొలిటికల్ వేడి రాజేస్తున్న జగన్ వ్యాఖ్యలు..!

By Xappie Desk, January 10, 2019 13:58 IST

పొలిటికల్ వేడి రాజేస్తున్న జగన్ వ్యాఖ్యలు..!

తాజాగా ఇటీవల ఇచ్చాపురం లో జరిగిన చివరి భారీ బహిరంగ సభలో ప్రస్తుత రాజకీయాల గురించి మరియు భవిష్యత్తు రాజకీయాల గురించి తనదైన శైలిలో సంచలన కామెంట్లు చేశారు వైసీపీ అధినేత జగన్. రాబోయే రోజుల్లో తాను అధికారంలోకి వస్తే ఏ విధమైన సంక్షేమ లు అందిస్తారు వంటి విషయాల గురించి మరియు ఇంకా అనేక విషయాల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో జగన్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగాలు లేక బాధ పడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం అని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
 
గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యం వస్తుందన్నారు. ప్రతి పథకం పేద వాడి ఇంటివద్దకే వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా కేవలం అర్హత మాత్రమే చూస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో యాభై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియ‌మిస్తామ‌ని, వారికి ఐదు వేలు జీతమిస్తామ‌ని.. ఆ యాభై ఇళ్లకు పథకాలు అందించే బాధ్యత అతనిదేనన్నారు. గ్రామ సచివాలయంతో సంప్రదిస్తూ పథకాలను సక్రమంగా అమలు చేసే బాధ్యతను అతనిపైనే ఉంచుతామన్నారు. రేషన్ బియ్యం కూడా నేరుగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలను 25 జిల్లాలుగా మారుస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.Top