ఏపీ బిజెపి పార్టీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే..!

By Xappie Desk, January 10, 2019 14:02 IST

ఏపీ బిజెపి పార్టీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పటికే విభజన హామీల విషయంలో మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారని ఒకపక్క అధికార పార్టీ టిడిపి భారీగా ప్రచారం చేయడంతో మరోపక్క ప్రజా వ్యతిరేకత బీజేపీపై స్పష్టంగా ఉండటంతో చాలామంది బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
అంతేకాకుండా తాను త్వరలో అనగా ఈనెల 21న జనసేన లో చేరుతున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు ఆకుల సత్యనారాయణ. తాను పార్టీని వీడుతున్న కారణాలను కూడా తెలియజేశారు..ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, ప్రధానంగా మూడు అంశాల్లో అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్‌ప్లాంట్‌ మంజూరు చేయకుండా అన్యాయం చేసిందని తెలిపారు. ఇదే క్రమంలో రానున్న ఎన్నికల్లో ఆకుల సత్యనారాయణ కి ఆయన భార్యకి కూడా పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.Top