వైసీపీ అధినేత జగన్ భాష గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్..!

వైసీపీ అధినేత జగన్ భాష గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్..!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కడప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఎటువంటి సమాజం కోరుకుంటున్నారో వంటి విషయాలను అర్థమయ్యేరీతిలో కడప జిల్లా నేతలకు వివరించారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు భాష సరిగా ఉండాలని పవన్ మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ప్రతిపక్ష నేత జగన్ కి రాజకీయాల్లో ఏ విధం గా మాట్లాడాలి వంటి విషయాలు తెలియదని చంపేయండి, కాల్చేయండి వంటి కామెంట్లు తనకు తెలియదని పేర్కొన్నారు పవన్. కేవలం రెండు కుటుంబాల మధ్య ఏపీ రాజకీయాలు నలిగి పోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటూ జగన్ అంటుంటే మరోపక్క మరొక అవకాశం ఇవ్వాలని టీడీపీ కోరుతుందని ఏది ఏమైనా ప్రజలను పదవులను అడిగేవారికి చిత్తశుద్ధి ఉండదని పేర్కొన్నారు.
 
2014లో తాను కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకున్నానని, కానీ కొన్ని చోట్లే పోటీ చేస్తే పార్టీ బలోపేతం కాదని ఆగిపోయానని పేర్కొన్నారు. అప్పుడు తాను మద్దతు ఇచ్చినందున టీడీపీ, బీజేపీలు గెలిచాయన్నారు. ప్రజలకు సేవ చేయాలనే చిరంజీవి పార్టీ పెడితే పక్కన ఉన్నవాళ్లే నిరాశపరిచారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఎంత ఒత్తిడి ఉన్నా ఇందిరా గాంధీలో తట్టుకునే శక్తి ఉండాలని అటువంటి నాయకులు జనసేన పార్టీ లోకి రావాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా ప్రస్తుతం నా గురి మాత్రం రాష్ట్రంలో ఉన్న యువతను రాజకీయ శక్తిగా మార్చాలని అన్యాయాలను చేసే ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి తీసుకు వెళ్లాలని వెల్లడించారు.Top