బ్రేకింగ్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయిన ప్రకాష్ రాజ్..!

By Xappie Desk, January 11, 2019 15:49 IST

బ్రేకింగ్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయిన ప్రకాష్ రాజ్..!

గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తూ ప్రశ్నలు వేస్తూ అనేక చర్చలలో జాతీయస్థాయిలో పాల్గొంటూ అడుగులు వేస్తున్న ప్రకాష్ రాజ్ తాను త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు స్వతంత్రంగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నీ కలిశారు ప్రకాష్ రాజ్. దీంతో వీరిద్దరూ కలిసిన సమావేశంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
 
ప్రకాష్ రాజ్ నిర్ణయాన్ని స్వాగతించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి కృతజ్ఞతలు తెలపడానికి కలిశానని ప్రకాష్ రాజ్ చెబుతున్నప్పటికిని, కాస్త రాజకీయంగా కొత్త చర్చ తెరపైకి వచ్చేలా కనిపిస్తుందని అర్థమవుతుంది. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. అందులో ‘నా రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేశాను.
 
ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటూ.. కొన్ని సమస్యలపై చర్చించాం. ఆ సమస్యలకు పరిష్కారానికి వివిధ మార్గాలను పంచుకోవాలని కోరాను’అన్నారు. మొత్తంమీద ప్రకాష్ రాజ్ కేజ్రీవాల్ భేటీ ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Image source:TwitterTop