ఎన్నికల ముందు టిడిపికి కోలుకోలేని దెబ్బ కొట్టిన మంత్రి..!

By Xappie Desk, January 11, 2019 15:55 IST

ఎన్నికల ముందు టిడిపికి కోలుకోలేని దెబ్బ కొట్టిన మంత్రి..!

కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారి గా మారిపోతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న క్రమంలో ఏపీ పర్యాటకశాఖ మంత్రి కర్నూలు జిల్లా టీడీపీ నాయకురాలు శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన అఖిలప్రియ తర్వాత తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లిపోయింది అయితే కర్నూలు జిల్లాలో ఉన్న టీడీపీ నేతలకు మరియు భూమా అఖిలప్రియ కి మధ్య వివాదాలు నెలకొనడంతో చాలా పంచాయతీలో చంద్రబాబు దృష్టికి వెళ్లిన అఖిల ప్రియా కి సరైన న్యాయం, గౌరవం దక్కకపోవడంతో ఇటీవల కర్నూలు జిల్లాలో చంద్రబాబు జరిగిన మీటింగ్ కు అఖిల ప్రియ గైర్హాజర్ అయింది.
 
ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దలు కూడా అఖిల ప్రియా రాకపోవడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఒక్క‌సారిగా షాక్ తిన్న అఖిల‌ప్రియ పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో ఆమె జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశ‌లు ఉన్నాయ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే భూమా కుటుంబానికి, మెగా కుంటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. గ‌తంలో శోభానాగిరెడ్డి ప్ర‌జారాజ్యం పార్టీ త‌రుపున పోటీ చేసి నెగ్గారు. దీంతో గ‌తంలో ఉన్న ప‌రిచ‌యాల‌తో ఇప్ప‌టికే జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో అఖిల‌ప్రియ ట‌చ్‌లో ఉన్నార‌ని, సంక్రాంతి తరువాత జనసేన పార్టీ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల ముందు మంత్రి అఖిలప్రియ పార్టీ మారడం తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top