ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలపై ఎవరు ఊహించని కామెంట్లు చేసిన ఉండవల్లి..!

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలపై ఎవరు ఊహించని కామెంట్లు చేసిన ఉండవల్లి..!

ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మరొకసారి చంద్రబాబుపై జగన్ పై మరియు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తున్న క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పటిలాగానే తన పెట్టేసి జగన్ పై కేసుల గురించి మరియు జైలు గురించి మాత్రమే ఆరోపణలు చేయగలరని అయితే వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని కానీ జగన్ కి అవి మైనస్ పాయింట్లు అని అన్నారు.
 
ప్రస్తుతం జగన్ పై ఉన్న కేసుల్లో సరైన విషయాలు ఆధారాలు లేవని న్యాయస్థానంలో దృష్టిలో కూడా అవి కేవలం ఆరోపణల మాదిరిగానే ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉండవల్లి. ఇంక జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. జగన్ పాదయాత్ర ఏపీ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లాడు గుండెల్లోకి బలంగా వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో గాని జగన్ పాదయాత్రలో కానీ చాలామంది ప్రజలు చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు అన్ని వర్గాల ప్రజలు జగన్ పాదయాత్ర బాగా ఆదరించారని పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని అభిప్రాయపడ్డారు.
 
మ‌రో వైపు ప‌వ‌న్ క‌ళ్యాన్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ప‌వ‌న్ నిర్వ‌హించిన మీటింగ్‌కి ఒక్క పొలిటీయన్ గా తనని మాత్రమే ఆహ్వానించిన విషయాన్ని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు.అంత‌కు ముందు ఆయ‌న‌తో త‌న‌కు ప‌రిచ‌యం లేద‌ని…. ఆ మీటింగ్ కి ఆహ్వానించడాన్ని తనకిచ్చిన అపారమైన గౌరవంగా భావించానని, ఈరోజుకి కూడా పవన్ కల్యాణ్ ని తానేమీ అనలేనని, తానేమీ కామెంట్ చేయలేనని అన్నారుTop