జగన్ పై కోడి కత్తి దాడి గురించి హైకోర్టులో పిటిషన్ వేసిన బాబు ప్రభుత్వం..!

By Xappie Desk, January 11, 2019 16:35 IST

జగన్ పై కోడి కత్తి దాడి గురించి హైకోర్టులో పిటిషన్ వేసిన బాబు ప్రభుత్వం..!

గత సంవత్సరం అక్టోబరు మాసంలో వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఏపీ రాజకీయాలను కుదిపేసింది. దాడి కావాలనే టిడిపి నేతలు చేయించారని వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపించగా మరోపక్క జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారని సానుభూతి రాజకీయాల కోసం ఓట్ల కోసం జగన్ వేసిన ప్లాన్ అని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మీడియా ముందు గగ్గోలు పెట్టారు. అయితే ఈ క్రమంలో ఈ కేసు గత కొంత కాలం నుండి హైకోర్టులో విచారణ జరుగుతుండగా తాజాగా ఇటీవల హైకోర్టు స్టేషను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ టి అప్పగించింది.
 
ఈ నేపథ్యంలో జగన్ పై దాడి చేసిన వ్యక్తి నిందితుడిని (శ్రీనివాస్ నీ) కూడా కస్టడీకి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు చేసింది. ఈ నేపథ్యంలో జగన్ పై దాడి చేసిన వ్యక్తి నిందితుడిని ఎన్ఐఏ కస్టడికి అప్పగించడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు హాజరుపరిచేందుకు అతనిని తరలించారు. నేడు ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో శ్రీనివాసరావును హాజరపరచనున్నారు. జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని రాష్ట్రప్రభుత్వం తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.Top