సీనియర్ ఎన్టీఆర్ పై మరియు జగన్ పై ఎవరు ఊహించని కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్.?

By Xappie Desk, January 11, 2019 16:37 IST

సీనియర్ ఎన్టీఆర్ పై మరియు జగన్ పై ఎవరు ఊహించని కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్.?

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలవారీగా జనసేన పార్టీ నేతలతో నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకు అర్థం కాకుండా వ్యూహాలు చాలా బలమైన రాజకీయ నేతగా తనని తాను ఆవిష్కరించుకుంటూ జనసేన పార్టీని సామాన్య ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర యువత పై ఎక్కువ దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడేది ఎక్కువ యువతని అందువల్ల 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున కచ్చితంగా యువతను ప్రోత్సహించే విధంగా అభ్యర్థులను నిలబెడతామని పార్టీ సమావేశాలలో కచ్చితంగా తేల్చేశారు పవన్.
&nbsp
అయితే తాను నిర్వహిస్తున్న సభలకు వచ్చిన జనాన్ని చూసి ఎప్పుడు పొంగిపోని మనస్తత్వం నాది అని.. పవన్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. ‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను జగన్ను ఉద్దేశించి పవన్ చేసిన కామెంట్లని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జగన్ ఏ సభ పెట్టిన చాలామంది ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్న క్రమంలో ప్రత్యేకించి తన స్పీచ్ లో ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్న జగన్ కి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ వేశారని కామెంట్లు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.Top