తిరుమల కొండపైకి సామాన్యుడిలా వెళ్లిన జగన్..!

తిరుమల కొండపైకి సామాన్యుడిలా వెళ్లిన జగన్..!

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ మేనియా కొనసాగుతోంది. ముఖ్యంగా జగన్ తలపెట్టిన పాదయాత్ర సామాన్య ప్రజల గుండెల్లో బలంగా వెళ్లిపోవడం మరియు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో పాదయాత్రలో సామాన్యులకు మరీ చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యేలా జగన్ వివరించడం మరోపక్క ఎన్నికలు రావడం ఇదే క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఫలితాలు రావడంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన తన పాదయాత్ర అయిపోయిన సందర్భంగా తాజాగా జగన్ ఇటీవల తిరుమల తిరుపతి శ్రీవారిని కాలినడకన సామాన్యుడిలా దర్శించుకున్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు. సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు.
తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. కాలినడకన కొండ పైకి వెళుతున్న జగన్ కి భక్తులు మరియు చాలామంది వైసీపీ పార్టీకి మద్దతు తెలిపేవారు సీఎం సీఎం అంటూ ఒకపక్క కేకలు వేస్తూ మరోపక్క శ్రీవారి నామస్మరణలు చేశారు. ఇదే క్రమంలో కొండపైకి జగన్ వెళ్తున్న సమయంలో ముందుండి పార్టీ నాయకులు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ బౌన్సర్ల మారి తన అది నాయకుడు జగన్ కి అండగా కొండగా నిలబడి ముందుండి నడిపించారు. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక పొలిటికల్ లీడర్ గా ఇంత క్రేజ్ ప్రజల్లో సంపాదించడం జగన్ చేసుకున్న అదృష్టమని వైసిపి పార్టీకి చెందిన వారు వైయస్ సానుభూతిపరులు కామెంట్స్ చేస్తున్నారు.


Image Source: TwitterTop