ఏపీ తెలంగాణా బార్డర్ లో 15 చోట్ల హోరా హారీ !

By Xappie Desk, November 17, 2018 12:36 IST

ఏపీ తెలంగాణా బార్డర్ లో 15 చోట్ల హోరా హారీ !

మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్ర మరియు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఓటర్ల నాడి తెలంగాణ ఎన్నికలను దిశానిర్దేశం చేయనున్నారు అని అంటున్నారు తెలంగాణ రాజకీయ పరిశీలకులు. ఇదే క్రమంలో తెలంగాణ పార్టీలో ఉన్న టిఆర్ఎస్ మరియు మహా కూటమి నాయకులు కూడా ఆంధ్ర ఓటర్లను ఆకర్షించడానికి నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కలిగిన ప్రాంతాలలో 15 నియోజకవర్గాలు ఉన్నయి.
 
2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలిచింది..మిగిలిన 12 స్థానాల్లో వివక్ష పార్టీలు తమ గెలుపు జెండా ఎగరవేయడం జరిగింది. అయితే 2014 ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్థాపించడంతో వెంటనే టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ పదంగా పుంజుకుంది.
 
ఈ క్రమంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గట్టిగా ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రావడానికి తీవ్ర కృషి చేస్తున్నాడు. మరోపక్క నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగానే తన ఓటు బ్యాంకు కాపాడుకుంటూ ముందుకెళ్తుంది. మిగతా చోట్ల టిఆర్ఎస్ మరియు మహా కూటమి పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top