ప్రచారానికి కెసిఆర్ రెడీ… 19,20 తేదీలలో ఆరు బహిరంగ సభలు

ప్రచారానికి కెసిఆర్ రెడీ… 19,20 తేదీలలో ఆరు బహిరంగ సభలు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆరెఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రచారం విషయంలో మామూలు దూకుడు చూపించట్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్దిరోజులు సమయమే ఉన్న తరుణంలో ఆయన ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేవలం రెండు రోజుల్లో ఆయన 6 బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. మహా కూటమి వలన ఆయన మీదున్న ఒత్తిడి ఇప్పుడు అంతా ఇంతా కాదు. లాంఛనం అనుకున్న గెలుపు ఇప్పుడు సందేహాస్పదంగా మారడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
 
ఇప్పటికే అత్యుత్సాహం, అతి విశ్వాసంతో ముందే అసెంబ్లీ ఎన్నికలకు తెరతీసి చిక్కుల్లో పడిన ఇతను సమయం మించిపోకముందే ప్రచారానికి నడుం కట్టారు. దీనిలో భాగంగా 19వ తేదీన ఖమ్మం, పాలకుర్తి రెండు బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఎలాగూ టీఆరెఎస్ అనుకూల మీడియా ఉండనే ఉంది కాబట్టి మిగతా చోట్ల ప్రసారం ద్వారా ఈ సభలను వ్యాపింపచేస్తారు. అదీ కాకుండా ఆయన పెట్టబోయే బహిరంగ సభలు ఉన్న జిల్లాలు తెలంగాణలో చాలా ముఖ్యమైనవి.
 
గ్రేటర్లో కూటమి నుండి పెద్దగా ఇబ్బంది తలెత్తకపోవచ్చు అని భావించి ఆయన ఈ ప్రాంతాల్లో ప్రచారం జరపనున్నట్లు చెప్తున్నారు. ఇక 20వ తేదీన సిద్దిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిల్లో జరిగే నాలుగు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఇలా రెండురోజుల్లో ఆయనే దాదాపు తెలంగాణ అన్నీ వార్తా ఛానళ్లలో కనిపిస్తారు. ఇలా ఆరు భారీ బహిరంగసభలలో ప్రసంగించి ఆయన కాంగ్రెస్-టీడీపీ కూటమిని అనగద్రోక్కుతారని పార్టీ నేతలంతా ఆశాభావంతో ఉన్నారు. చూడాలి మరి… కేసీఆర్ తన ప్రచారంతో గులాబీ పార్టీని గట్టెక్కిస్తాడో లేదో.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top