బ్రేకింగ్ న్యూస్: టిడిపి నుండి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్..?

By Xappie Desk, December 27, 2018 11:35 IST

బ్రేకింగ్ న్యూస్: టిడిపి నుండి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్..?

చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిన విభజన తో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదని విపక్ష పార్టీలు అనేక రీతులుగా విమర్శలు చేస్తున్నాయి. కేవలం తన రాజకీయ మనుగడ కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని రాష్ట్ర ప్రజలను పాలనను గాలికొదిలేశారని ఇలా అనేక రీతులుగా చంద్రబాబు సర్కార్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేసుకుంటూ ప్రజలు అభిమానులను వారి నమ్మకాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికలలో టిడిపి తో జత కలిసిన పవన్ కళ్యాణ్ తాజాగా రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర అంటూ చంద్రబాబుపై ఆయన పార్టీ ప్రతినిధులపై మంత్రులపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇంతలా చంద్రబాబు ప్రభుత్వం పై రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు పక్కదారి చూస్తున్నారని...త్వ‌ర‌లో ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీని వీడ‌డానికి రెడీ అవుతున్నారని పేర్కొన్నారు బిజెపి పార్టీకి చెందిన మాణిక్యాలరావు. టీడీపీలో దాదాపు 15 నుండి 25 మంది సిట్టింగ్ నేత‌లు పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఆయన హెచ్చరించారు. దీంతో మాణిక్యాలరావు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.Top