తెలంగాణ అసెంబ్లీ నడిచింది 28 రోజులే...లీక్ అయిన లెక్కలు చూడండి!

By Xappie Desk, November 23, 2018 18:13 IST

తెలంగాణ అసెంబ్లీ నడిచింది 28 రోజులే...లీక్ అయిన లెక్కలు చూడండి!

అవును మీరు చదివింది నిజమే. ఒక సర్వే ప్రకారం 2016-2018 మధ్య తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏడాదికి కేవలం 28 రోజులు మాత్రమే నడిచిందట. ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి... ఏడాదికి వారి కేటాయించిన సమయం కేవలం 28 రోజులు. ఈ సర్వే చెప్పిన దాని ప్రకారం తెలంగాణ కంటే ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ నడిచిన రోజుల సంఖ్య ఎక్కువగానే ఉందట.
 
ఈ జాబితాలో కేరళ మరియు కర్ణాటక 46 రోజుల తో మొదటి స్థానంలో ఉండగా తరువాత మహారాష్ట్ర 45 రోజులతో రెండవ స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఒడిస్సా 42 రోజులు ఆ తర్వాత జమ్ము కాశ్మీర్ 39 రోజులు ప్రతీ ఏడాది తమ రాష్ట్ర అసెంబ్లీని నడిపించాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కూడా 28 రోజుల తో ఈ లెజిస్లేటివ్ రీసర్చ్ లో 11వ స్థానంలో ఉంది.
 
ఈ వివరాలు చూసిన తర్వాత అసలు ఆ నెల రోజులు కూడా అసెంబ్లీ ఎందుకు? మీరు ఏం వెలగబెడుతున్నారు అని మీకు మళ్ళీ అధికారం కట్టబెట్టాలని పలువురు టిఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. ఓట్ల కోసం మీకు కావాల్సినన్ని రోజులు మీటింగులు ప్రచారాలు చేసుకుంటారు కానీ మా భవిష్యత్తు అంటే అంత నిర్లక్ష్యమా అని తమ బాధను వెళ్లగక్కుతున్నారు. వీళ్ళు పనిచేసిన 612 గంటల్లో కూడా 21% ప్రశ్నలు వేయడానికి, 20% చర్చించేందుకు, 9% కోటానుకోట్ల బడ్జెట్ గురించి మాట్లాడుకునేందుకు కేటాయించారు. మిగిలిన సమయం వీళ్ళు కొట్టుకోవడానికే సరిపోదు... ఇంక మన గురించి ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారు జనాలు.
 
ఇక అసెంబ్లీలో వీరి ప్రవేశపెట్టిన బిల్లుల్లో 11 శాతం బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల సంబంధించి ప్రవేశపెట్టిన మొదటి రోజే ఓకే అయిపోయాయి. ఎక్కువ బిల్లులు రాష్ట్ర ప్రజల అభివృద్ధికి తోడ్పడేవి కాకుండా ఈ ఫైనాన్సు, ట్యాక్సులు, పోలీసులు అంటూ ఎంత కాడికి డబ్బులు నొక్కేసే బిల్లులనే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా హౌస్ లో వారి కన్నంతా ట్యాక్సులు మీదే వేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి సంచలనమైన వివరాలు వెల్లడైన నేపధ్యంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల కోసం మళ్లీ ప్రజల దగ్గరికి ఎన్నో ప్రలోభపరిచే హామీలతో ఓట్ల కోసం వెళుతుండటం గమనార్హం.Top