టికెట్ కావాలంటే 30 కోట్లు అడిగారు అంటూ జగన్ పై జేసీ కామెంట్స్..!

టికెట్ కావాలంటే 30 కోట్లు అడిగారు అంటూ జగన్ పై జేసీ కామెంట్స్..!

అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ టికెట్ కావాలంటే 30 కోట్లు చెల్లిస్తే టికెట్ ఇస్తానని జగన్ తనతో అన్నారని షాకింగ్ కామెంట్ చేశారు.
 
ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్టీలో సీనియర్ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ని తన ప్రధాన అనుచురుల్లో ఒకరైన కాంట్రాక్టర్‌ను జగన్మోహన్ రెడ్డి తన వద్దకు పంపించారని దివాకర్ రెడ్డి తెలిపారు.టికెట్ ఇవ్వాలంటూ రూ. 30 కోట్లు ఇవ్వాల్సిందిగా వారు తనను డిమాండ్ చేశారని కానీ తాను అందుకు అంగీకరించలేదన్నారు. ''వాళ్ల తాత నాకు తెలుసు.. వాళ్ల నాయినా నాకు తెలుసు.. నేను పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను.. వాళ్ల తాతకన్నా మా తాతలు చానా భూస్వాములు, పెద్ద రెడ్లు, నా కంటేప అతను పెద్దొడా..? నేను కప్పం కట్టడానికి..? అంటూ వ్యాఖ్యానించారు. దీంతో జేసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్నాయి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top