జనసేన తరంగం కి IT కారిడార్ నుంచి అనూహ్య స్పందన !!

జనసేన తరంగం కి IT కారిడార్ నుంచి అనూహ్య స్పందన !!

యువత లో ఎక్కువగా మద్దతు ఉన్న పార్టీ జనసేన అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ కి ఉన్న అసమానమైన క్రేజ్ కారణం గా పవన్ కళ్యాణ్ అభిమాన గణం మొత్తం జనసేన కి సపోర్ట్ గా నిలుస్తూ వచ్చింది. అతని తమ్ముడు , బద్రీ సినిమా నుంచీ ఉన్న క్రేజ్ ఇప్పటి వరకూ పవన్ కి అండగా నిలుస్తోంది .. ఈ టైం లో పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక బలం ఐన యువత వివిధ కార్యక్రమాలతో జనసేన పార్టీ కి దోహదం అవుతున్నారు.
 
తాజాగా పవన్ కళ్యాణ్ డిసెంబర్ 5న జనసేన తరంగం అనే కార్యక్రమం మొదలు పెట్టడం చూసాం మనం. అనంతపూర్ నుంచి మొదలయ్యి ఫేస్ బుక్ లైవ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన తరంగం లో అనేక మంది యువత పాల్గొనే లా చేసాడు. ఇప్పుడు ఆఖరి రెండు రోజులూ ఐటీ ఉద్యోగులని పవన్ కళ్యాణ్ పాల్గొన మని కోరుతున్నారు.
 
జనసేన తరంగం అనేది ఒక డిజిటల్ రివల్యూషన్ గా చెబుతున్నారు విశ్లేషకులు.జనసేన యొక్క ఆలోచనలు , ప్రమాణాలూ ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత ప్రతీ ఐటీ ఉద్యోగి తీసుకోవాలి అనేది పవన్ ఆలోచన గా తెలుస్తోంది. దీనికి వస్తోన్న అనూహ్య స్పందన చూసి టీడీపీ , వైకాపా కంగారు పడుతున్నాయి అంటున్నారు. పొలిటికల్ గా ఇన్నాళ్ళూ కుల ప్రాతిపదికన ఓట్లు వేయించుకున్న ఈ రెండు పార్టీలూ పవన్ తమ ఓటు బలం ఐన యువతని లాక్కుని వెళ్తుంటే ఏం చెయ్యాలో అర్ధం కాక మిన్నకుండి పోయారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top