ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త OPERATION B - 30 మంది ప్రముఖుల మీద దాడులు ?

By Xappie Desk, November 08, 2018 19:58 IST

ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త OPERATION B - 30 మంది ప్రముఖుల మీద దాడులు ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో సరికొత్త ఆపరేషన్ మొదలైంది అంటూ ఒక ఫేమస్ టీవీ ఛానల్ ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రాం ఒకటి చేస్తోంది . ' ఆపరేషన్ B ' అంటూ చంద్రబాబు ని అడ్డుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టాయి అంటూ సరికొత్త విషయాలు బయట పెడుతోంది. బీజేపీ కర్నాటక లో ఓడిపోవడం తో ఇప్పుడొక కొత్త ప్లాన్ ని తీసుకొచ్చారు అనీ ముప్పై మంది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుల మీద ఇంకం టాక్స్ , ఈడీ ఇలా రకరకాల దాడులు జరుగుతాయి అనే విషయం చెబుతున్నారు. దాదాపు ముప్పై మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధుల మీద దాడులు జరగబోతున్నాయి అనీ అంటున్నారు. కొమ్మలపాటి శ్రీధర్ , వల్లభనేని వంశీ , బోడె ప్రసాద్,, ఎంపీ సీఎం రమేష్ , మురళీ మోహన్ , బూరుగు పల్లి శేషరావు , ఆలపాటి రాజా డీవీ మనోహర్ , మిడ్ వెస్ట్ రాఘవరెడ్డి లాంటి పేర్లు ఈ ఆపరేషన్ బీ లో ఉన్నాయి అని సదరు ఛానల్ చెబుతోంది .. ముఖ్యంగా మంత్రులు నారాయణ , గంటా శ్రీనివాసరావు , సిద్దా రాఘవరావు లాంటి వారి మీద భారీ ఎత్తున ఈడీ దాడులు చెయ్యబోతోంది అని చెబుతున్నారు. టీడీపీ పార్టీ నీ ఆ పార్టీ నేతలనీ అవినీతి పరులుగా చూపించే కుట్రలో భాగమే ఇదంతా అంటున్నారు.Top