గవర్నర్ vs చంద్రబాబు - రసకందాయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం..!

By Xappie Desk, November 12, 2018 09:42 IST

గవర్నర్ vs చంద్రబాబు - రసకందాయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం..!

మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా అమరావతి కి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు, చంద్రబాబుకు విముఖత పరిస్థితులు కనిపించాయి. ఆయనను బాబు పెద్దగా పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుండి గవర్నర్ టిడిపి పైన వివక్ష చూపుతున్నారని ఆయా నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా జగన్ కోడి కత్తి విషయంలో ఈ విషయం తేటతెల్లమైంది. దాడి జరిగిన గంటల్లోనే గవర్నర్ స్పందించి నేరుగా డీజీపీ తోనే దీనికి సంబంధించి విచారించడం గమనార్హం.
 
ఈ విషయంపై అప్పుడు చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మామూలుగానే చాలా ఓపిక గల వ్యక్తి. మోదీ చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నా, సహనంగా చూశారే తప్ప మొదట్లోనే కోపం ప్రదర్శించలేదు. అతని ఎదురుగా వస్తే కోపాన్ని లోపల నుంచి పెట్టుకొని పైకి ఇవ్వాల్సిన మర్యాదను ఇచ్చేశారు. కానీ నరసింహన్ విషయంలో ఆ పరిస్థితి కనపడలేదు. అసలు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని చంద్రబాబు ఎప్పటి నుండో ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ వేలు పెట్టడం ఏంటి అనేది ఈయన వాదన.
 
గవర్నర్, ఎప్పుడు అమరావతి కి వచ్చిన చంద్రబాబుతో భేటీ అవుతారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి అసలు కనిపించలేదు. అంతకు ముందు కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల గురించి కూడా గవర్నర్‌తో చర్చించలేదు. సీఎంవో ద్వారానే కొత్త మంత్రుల పేర్లను రాజ్‌భవన్‌కు పంపారు. మంత్రుల ప్రమాణ స్వీకార సమయంలోనూ ఇద్దరు ముభావంగానే కనిపించారు. అతన్ని నేరుగా కలిసింది లేదు… మాట్లాడింది లేదు. ఈ రకమైన పరిస్థితే గవర్నర్ ప్రభుత్వం పట్ల ఎంతో వివక్ష ధోరణిని చూపెట్టారని చెబుతోంది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop