రేవంత్ vs కేటీఆర్ – ఎవరిది గెలుపు?

By Xappie Desk, November 24, 2018 19:27 IST

రేవంత్ vs కేటీఆర్ – ఎవరిది గెలుపు?

తెలంగాణలో ఎన్నికల ఫీవర్ తార స్థాయికి చేరుకుంది. వ్యూహ ప్రతివ్యూహాలతో టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు ఎన్నికల రణరంగానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భవిష్యత్తు నేతల గా చెప్పబడే రేవంత్ రెడ్డి మరియు కేటీఆర్ అయితే ఒకరితో ఒకరు విపరీతంగా పోటీ పడుతున్నారు. కొడంగల్ లో రేవంత్ ను ఓడించాలని ఇప్పటికే కేటీఆర్ పర్యటించి బహిరంగ సభలు పెట్టి - రోడ్ షో నిర్వహించి అక్కడ ప్రజలను కోరారు.
 
ఇదే పని మీద ఒక వైపు టిఆర్ఎస్ శ్రేణులన్నీ కొడంగల్ లో తిష్ట వేసుకుని కూర్చుంటే మరోవైపు రేవంత్ కేటీఆర్ పోటీచేసే నియోజకవర్గం సిరిసిల్లలో అతనికి దీటుగా ప్రచారం చేసేందుకు సర్వత్రా సిద్ధం చేసుకున్నారు. అతని వాడమని సాధించేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగుతుండడంతో తెలంగాణ రాజకీయాలకు ఎప్పుడు కేటీఆర్ మరియు రేవంత్ కేంద్ర బిందువులుగా మారి గట్టి ప్రత్యర్థులుగా తలపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సిరిసిల్ల మీద తన పూర్తి ఫోకస్ ను ఉంచిన రేవంత్ 26వ తేదీ నుండి కేటీఆర్ కు వ్యతిరేకంగా అక్కడ రోడ్ షో నిర్వహించాలని భావిస్తున్నారు.
 
సిరిసిల్లలో కాంగ్రెస్ తరపున కేటీఆర్ కి పోటీ గా న్యాయవాది కేకే మహేందర్రెడ్డి ఉన్నారు. ఐ టి మినిస్టర్ కి ఇతనే మీ తీసిపారేసి ప్రత్యర్థి అయితే కాదు. 2009లో అదే కేటీఆర్ పైన ఈయన 171 లతో ఓడిపోయారు. దీంతో మహేందర్ రెడ్డి విజయ్ అవకాశాలు కూడా మెండుగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాలని అనుకుంటున్నాడు. సిరిసిల్లలో వరుస పర్యటనలకు స్కెచ్ గీశారు. బహిరంగ సభ - రోడ్ షోలు నిర్వహించి ఎండగట్టాలని చూస్తున్నాడు. దీంతో కేటీఆర్ ను ఇరుకున పెట్టాలని రేవంత్ వేసిన ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి..
 Top