2 వేల నోటు ప్రింటింగ్ ఆపేసిన రిజర్వ్ బ్యాంక్..?

By Xappie Desk, January 04, 2019 11:23 IST

2 వేల నోటు ప్రింటింగ్ ఆపేసిన రిజర్వ్ బ్యాంక్..?

గతంలో పెద్ద నోట్ల రద్దు అంటూ 500 మరియు వెయ్యి నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 2 వేల నోటు కూడా రద్దు చేసినట్లు ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు లో 2 వేల నోటు రద్దు ముద్రణ ఆగిపోయినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఎప్పటినుండో 2 వేల నోటు రద్దు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల ముందు 2 వేల నోటు ను రద్దు చేస్తే దేశానికి మంచి చేసిన వారవుతారని చాలామంది ఇప్పటికే కామెంట్లు చేశారు.

ఈ క్రమంలో ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి పార్టీ రెండువేల నోట్లను సిద్దం చేసుకుంటున్న నేపధ్యంలో ఇది చేయగలిగితే మంచిదే అని చాలామంది విశ్లేషిస్తున్నారు. ఓటు రేటు ఏకంగా రెండువేలకు పెరిగింది. పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వీటి ముద్రణ నిలిచిపోనుందని పేర్కొన్నాయి. అయితే, చలామణీని తగ్గించడమంటే రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లు యథాప్రకారం చెల్లుబాటవుతాయని, అయితే వీటిని దశలవారీగా తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.Top