2019 ఎన్నికలకు చింతమనేనికి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్..?

By Xappie Desk, December 24, 2018 12:21 IST

2019 ఎన్నికలకు చింతమనేనికి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్..?

ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశించే ప్రతి ఒక్కరు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని సర్వే బట్టి ప్రజలలో అతనికి ఉన్న ఆదరణ పట్టి టికెట్ ఇస్తానని ఇలా అనేక రకాలుగా 2019 టీడీపీ టికెట్ ఆశించే వారికి టీడీపీ అధినేత సూచనలు ఇవ్వడం జరిగాయి.

మరియు ఇదే క్రమంలో ప్రజాక్షేత్రంలో టిడిపి పార్టీ అభ్యర్థులపై ఎవరిపై ఎక్కువ ప్రజావ్యతిరేకత ఉంటుందో అన్న దానిపై కూడా సర్వే నిర్వహిస్తున్నారన్న వార్త తెలుగు తమ్ముళ్లకు చెమటలు పట్టించింది. అయితే పవన్ దెబ్బకు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేకు మాత్రం వేటు తప్పదని వార్తలొస్తున్నాయి.

అతనే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజిక వర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పవన్ అక్కడ అడుగు పెట్టక ముందే చింతమనేని యొక్క ఆగడాలకు హద్దుల్లేకుండా పోయాయి, పవన్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి ప్రజలు చింతమనేని వలన పడుతున్న బాధలను వెళ్లగక్కుకోగా పవన్ చింతమనేని పై విరుచుకుపడ్డారు.

అతని యొక్క ప్రవర్తనను మార్చుకోవాలని పవన్ ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చినా చంద్రబాబుకి కూడా అతన్ని కంట్రోల్ లో పెట్టమని చెప్పినా సరే వారు ఆయన విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా అతని యొక్క ఆగడాలు ఇంకా శృతి మించేసరికి పవన్ తన స్వరాన్ని మరింత స్థాయిలో పెంచారు. దీంతో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు టాక్. 2019లో కచ్చితంగా చింతమనేని ప్రభాకర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.Top