2019లో పోటీ చేసే స్థానాల లెక్క తేల్చిన జనసేన..!

2019లో పోటీ చేసే స్థానాల లెక్క తేల్చిన జనసేన..!

ఏపీలో రాబోయే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. ఒక్కసారి జనసేన పార్టీ ఓటు బ్యాంకు గమనిస్తే రాష్ట్రంలో చాలా యువత జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యుడికి మేలు జరుగుతుందని గత ఎన్నికల నుండే నమ్మి 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన చంద్రబాబు కి ఎక్కువ ఓటు వేశారు.

ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతున్న క్రమంలో రాష్ట్రంలో ఉన్న యువత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని కోరుకోవడం విశేషం. ఇదే క్రమంలో ఇటీవల ఎన్నికల సంఘం కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎంతగానో సంతోషించారు. ఈ గుర్తును కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేలా కార్యక్రమాలు రూపొందించాలని నాయకులకు నాదెండ్ల మనోహర్ సూచించారు.

అందుకోసం ఆదునిక టెక్నాలజి, సోషల్ మీడియా మాద్యమాలను వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. కచ్చితంగా జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని సామాన్యుల జీవితం కోసం నిరంతరం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్.Top