2019 జనసేన ఎన్నికల పొత్తు గురించి తేల్చేసిన నాదెండ్ల..!

By Xappie Desk, December 29, 2018 17:06 IST

2019 జనసేన ఎన్నికల పొత్తు గురించి తేల్చేసిన నాదెండ్ల..!

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ పొత్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జనసేన పార్టీ వైసీపీ పార్టీ తో పొత్తు పెట్టుకుంటుంది అన్న కామెంట్లపై స్పందించారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన తరంగం కార్యక్రమంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్ పలు జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా విశాఖలో జనసేన పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆ సమావేశంలో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదని ఒంటరిగా పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జనసేన పార్టీ పై లేని పోనీ కామెంట్లు చేస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి 70 వేల కోట్లు రావాల్సి ఉందని ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ జనసేన పార్టీతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు అని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్.Top