2019 ఎన్నికల్లో టికెట్ల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న పవన్ కళ్యాణ్..!

By Xappie Desk, January 09, 2019 14:29 IST

2019 ఎన్నికల్లో టికెట్ల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఏపీ ఎన్నికల్లో టికెట్ల విషయంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కి జై కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో 2014 ఎన్నికల మాదిరిగా ఉండదని అధికార మరియు విపక్ష పార్టీలకు ఇటీవల మీడియా సమావేశంలో తెలియజేశారు పవన్. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో ఎక్కువగా యువతనే ప్రోత్సహించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కొత్తవారికి జనసేన పార్టీ తరఫున 60 శాతం టికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 40 శాతం సీట్లలో ఓ 20 శాతాన్ని భావజాలం ఉన్న వారికి - మరో 20 శాతాన్ని విలువలు కలిగిన వారికి కేటాయిస్తామని ఆయన తేల్చేశారు. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసే జాబితా ఒక్క కొత్త వారితోనే కాకుండా భావజాలం ఉన్నవారు - విలువలు కలిగిన వారితోనే బరిలోకి దిగుతామని ఎక్కడా కూడా పొత్తులు ఉండవని స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అర్థమవుతుంది.Top