2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పురందేశ్వరి..?

By Xappie Desk, January 11, 2019 16:30 IST

2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పురందేశ్వరి..?

ప్రస్తుతం మన రాష్ట్రంలో బిజెపి పార్టీ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో విభజన హామీల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి సరైన న్యాయం చేయలేని క్రమంలో పార్లమెంట్ సాక్షిగా ఆనాడు విభజన సమయంలో ఇచ్చిన హామీలు గాలికొదిలేసిన క్రమంలో బిజెపి పార్టీకి చెందిన పురందేశ్వరి రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ కండువా కప్పుకొని పోటీ చేయడానికి రెడీ అయినట్టు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వినపడుతున్న వార్త. ముఖ్యంగా బిజెపి పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయంగా రావలసిన ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్ పరిశ్రమ వంటి విషయంలో బిజెపి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా మోసం చేసిందని ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయింది.
 
దీంతో ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి పార్టీలో ఉంటే రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండదని భావనలో పురందేశ్వరి ఉన్నట్లు.. మరోపక్క ఆంధ్రాలో అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్న వైసిపికి ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో ఆ పార్టీలోకి వెళ్లడానికి రెడీ అయినట్లు సమాచారం. సంక్రాంతి త‌ర్వాత వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
చిన్న‌మ్మ ఫ్యామిలీ వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారంతో ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు వేడెక్కాయి. పురందేశ్వ‌రి ఎంపీగా పోటీ చేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. గుంటూరు లేదా న‌ర్స‌రావు పేట స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్ర‌చారం జ‌రుగుతున్నా జ‌గ‌న్‌ నుంచి మాత్రం హామీ రాలేదంట‌. మరోపక్క తన కుమారుడిని రాజకీయ ఎంట్రీ చేయించడానికి కూడా పురందేశ్వరి ఆలోచిస్తున్నట్లు సమాచారం.Top