అల్లుఅర్జున్ తో మరో ఇద్దరు!

Advertisement

by Xappie Desk | April 14, 2019 18:33 IST
Follow Xappie
అల్లుఅర్జున్ తో మరో ఇద్దరు!

అల్లుఅర్జున్ తో మరో ఇద్దరు!
 
అల్లుఅర్జున్ సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పన్నక్కర్లేదు. తన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆంధ్రలోనే కాక కేరళలో కూడా సంబరాలు చేసుకుంటుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్ తన దూకుడు పెంచాడు.
 
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా నిన్న పూజ కార్యక్రమంతో మొదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటిస్తోన్నట్లు తెలుస్తోంది.
 
నాగ్ మేనల్లుడు సుశాంత్, నవదీప్ లు ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారట. ముఖ్యంగా సుశాంత్ క్యారెక్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంటుందని.. ప్రధానంగా స్వాతిముత్యం టైపు క్యారెక్టర్ అని సమాచారం.
 
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. టబుకి జోడిగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారు.
 
ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అంట. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Advertisement


Advertisement

Top