Advertisement

Advertisement

Advertisement

జూనియర్ మనసు దోచుకున్న పంజాబీ ఫాన్!

by Aravind Peesapati | May 12, 2019 11:15 IST
జూనియర్ మనసు దోచుకున్న పంజాబీ ఫాన్!

జూనియర్ మనసు దోచుకున్న పంజాబీ ఫాన్!
 
పూర్వం నుండి పెద్దలు ఈ భూమి మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటూ ఉంటారు. అయితే సామాన్య లాంటి మనుషులు ఉన్న పెద్దగా ఈ భూమ్మీద పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. అదే సెలబ్రిటీలు అయితే కచ్చితంగా సదరు వ్యక్తి ఫోటో గాని వీడియో గాని ప్రస్తుతం ఉన్న సదుపాయాలు వంటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఒక వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలో ఉండటంతో సదరు వ్యక్తి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సేమ్ టు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లా అచ్చు గుద్దినట్టు శమిందర్ సింగ్ అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కి జిరాక్స్ ల ఉన్నాడు. సదరు వ్యక్తి యొక్క వివరాల్లోకి వెళితే శమిందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడు ఏరోనాటికల్ ఇంజినీర్ అయిన ఈ షమిందర్ ట్విట్టర్ ఖాతాలో ఫోటోలు చూస్తే అచ్చుగుద్దినట్టుగా ఎన్టీఆర్ లాగే ఉన్నాయి. తన ట్విట్టర్ ఖాతాలో "నేను Jr. ఎన్టీఆర్ ఫ్యాన్ ను" ఇంట్రో ఇచ్చుకున్నాడు. ఎన్టీఆర్ ను కలవాలని ఉందని ఎంతో అశగా ఎదురు చూస్తున్నానని కూడా అంటున్నాడు. ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులు ఈ షమిందర్ సింగ్ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా శమిందర్ సింగ్ కి యాక్టింగ్ పట్ల కూడా ఆసక్తి కూడా ...ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన హైలెట్స్ డైలాగులు కొన్నిటిని డబ్ స్మాష్ లో వీడియో గా తీసుకొని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఎన్టీఆర్ కూడా శమిందర్ సింగ్ యొక్క ఫోటోలు...వీడియోలు చూసి ఎంతో ముచ్చట పడినట్లు...అతను చేసిన యాక్టింగ్ పై మనసు పడినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది.


Advertisement


Advertisement

Top